హైదరాబాద్,ఫిబ్రవరి 28(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2015-16 ఆర్థిక బడ్జెట్ భవిష్యత్‌కు దిక్సూచీలా ఉందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే రూ. 17 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ పేదవారి అభివృద్ధికి ఉపయోగపడుతుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ తెలుగు రాష్టాల్ర హావిూలు నెరవేర్చేలా ఉందని లక్ష్మణ్ అన్నారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సహాయంతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కులీ కుతుబ్‌షా కట్టడానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించడం శుభపరిణామమని ఆయన సంతోషం వ్కక్తం చేశారు.ఆంధప్రదేశ్ రాష్టాన్రికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన బీహార్, పశ్చిమ బెంగాల్తో పాటు ఏపీకి కూడా కేంద్రం సాయం చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కాగా ఏపీతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ కూడా ప్రత్యేక ¬దాను కోరుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం ఈ రాష్టాల్రకు ప్రస్తుతం ప్రత్యేక ఆర్థిక సాయంతోనే సరిపెట్టింది.




