గుంటూరు,ఫిబ్రవరి28(జనంసాక్షి): గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని చిలుమూరు గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు శనివారం గల్లంతయ్యారు. మహేశ్, ఊట్ల ఈశ్వర్, గణెళిశ్, సాయి వంశీ, రూపేశ్‌లు ఈ సంఘటనలో అదృశ్యమైనట్టు సమాచారం. వీరిలో ముగ్గురిని వెలికితీశారు. మిగతా ఇద్దరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. వారంతా తెనాలి నెహ్రూనికేతన్ పాఠ శాల విద్యార్థులు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది. చిలుమూరు లంక సవిూపంలోని కృష్ణాపాయలో విద్యార్థులు గల్లంతినట్లు తెలుస్తోంది. వీరంతా ఈతకు వెలల్‌ఇ గల్లంతయ్యారు.




