హైదరాబాద్,జూన్15(జనంసాక్షి):రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇవ్వకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ¬దాపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి సాకె శైలజానాధ్ ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక ¬దా సీమాంధ్రుల హక్కు అని అన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేసేందుకు గాను అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినా ఆయన పట్టించుకోలేదని అన్నారు. అఖలపక్షంతో కలసి పోరాడాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పది వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిని పక్కన పెట్టి పట్టిసీమ చేపట్టడం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. భూ సవిూకరణ, పునరావాసం వంటి పనులకు డబ్బు లేవంటున్న ప్రభుత్వం వారికి కావల్సిన కాంట్రాక్టర్ కు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎలా ఇచ్చారని రఘువీరా ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని డిమాండ్ చేస్తు కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం మంచి ఫలితం ఇచ్చిందన్నారు. ప్రత్యేక ¬దా ఇంతవరకు ఇవ్వని కేంద్రంపై టీడీపీ ఎందుకు ఒత్తిడి తేవడం లేదంటూ ప్రశ్నించారు. సీమాంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లయినా ఇప్పటి వరకు ప్రత్యేక ¬దాపై మోదీ పెదవి విప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై నిలదీయం ఒక్కటే మార్గమన్నారు.




