Thursday, 5 November 2026

ఎమ్మెల్యేల చీకటి ఒప్పందాలు

హైదరాబాద్‌ : పార్టీ నియమావళిని ఉల్లంఘించి చీకటి ఒప్పందాలకు పాల్పడ్డ శాసన సభ్యులను ప్రజలు తరిమి కొట్టాలని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు మస్తాన్‌వలీ పిలుపు నిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల కాలపరిమితి కోసం ప్రజల ఎన్నుకుంటే.. బేరసారాలు చేసుకుని ఇతర పార్టీల చెంతకు చేరటాన్ని ప్రజలు సహించరని మండిపడ్డారు. చట్టసభల సభ్యులు ఫిరాయింపు వ్యతిరేక చట్టం రావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. కేంద్రం ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫిరాయింపులకు పాల్పడ్డ సభ్యులు ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులుగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *