ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతా ప్రభాకర్ అనే ప్రకటించడం హర్షణీయం
ఇంద్రకరణ్ గ్రామ యువత సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 27 :::::: సీఎం కేసిఆర్ సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతా ప్రభాకర్ ని ప్రకటించడంపై ఇంద్రకరణ్ గ్రామ యువకులు హర్షం వ్యక్తం చేశారు . మహిపాల్ యాదవ్ అధ్వర్యంలో ఇంద్రకరణ్ నుంచి కంది మీదుగా పెద్ద ఎత్తున యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు .
సంగారెడ్డి పట్టణం లోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలసి వారు సన్మానించారు . తదనంతరం ఇంద్రకరణ్ గ్రామం నుంచి చింతా ప్రభాకర్ సమక్షంలో 60మంది యువకులు బీఅర్ఎస్ పార్టీ లో చేశారు. పార్టీలో చేరిన వారిని చింతా ప్రభాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో విశాల్ ,నర్సింలు, రాహుల్ ,రామకృష్ణ ,వికాస్ ,రోహిత్ తదితరులు ఉన్నారు . ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న వ్యక్తి చింతా ప్రభాకర్ అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో మా యువత పూర్తి సహకారం చింతా ప్రభాకర్ కు ఉంటుందని వారు హామీని ఇచ్చారు. ఈసారి చింతా ప్రభాకర్ గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి , మల్లేశం ,సామెల్ , వెంకటేశం , ఈశ్వర్ , గణేష్ తదితరులు ఉన్నారు .