బాల్క సుమన్ భ్రమను, భయాన్ని వీడి ధైర్యం తో మాట్లాడాలి.

మేచురిటీ లేక ఓటమి భయముతో తమ్ముడు బాల్క సుమన్ మాటలు…. చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్……………………………………………
నిన్న శనివారం జర్గిన ప్రజా ఆశీర్వాద ర్యాలీ లో కాంగ్రెస్ పార్టీ లోనీ ఎమ్మెల్యే అభ్యర్థులు నా వారే, నేను పంపిన వారే, మళ్ళీ తిరిగి వస్తారు అని ఎమ్మెల్యే సుమన్ చేసిన వాఖ్యలను తీవ్రంగా కండిస్తున్నాను అని డాక్టర్ రాజా రమేష్ అన్నారు.చెన్నూర్ కాంగ్రెస్ నేత రాజా రమేష్ ఆదివారం ఇక్కడ మాట్లాడుతూ నీకో, నీ బిఆర్ఎస్ పార్టీకో కుక్క లాగా తోక ఊపుకుంటూ వచ్చే వాళ్ళు గతంలో వచ్చారు. ఇప్పుడు ఉన్నవారు అంత మనుషులే, ఆత్మ గౌరవం ఉన్నవారు ఎవ్వరు రారు, ఇంకా ఆ భ్రమలో బ్రతుకకు అని అన్నారు.
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చిన్న వయస్సు, మతిస్థిమితం లేక పిల్ల మాటలు మాట్లాడుతున్నాడు అని, రాజకీయ, సమాజ జ్ఞానం వయస్సు పెరిగితే వస్తుంది అని అన్నారు. ఎన్నికల్లో ప్రత్యర్ధి పై ప్రజా ఆదరణ తో, ఓటు బ్యాంకుతో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ పార్టీ లో కోవర్టులు వున్నారని, ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు అని ఆరోపించారు. బిఆర్ఎస్ చెన్నూరు అభ్యర్ధిగా ప్రకటించిన అనంతరం నియోజకవర్గం కు వచ్చిన బాల్క సుమన్ నియోజకవర్గంలో ఈ సారి గెలుపు అసాధ్యం అని ముందుగానే గ్రహించి కాంగ్రెస్ పార్టీ కూడా తనదే అని చెప్పడం జరిగిందని తెలిపారు. గెలిచే కాంగ్రెస్ పార్టీ కూడా తనదే, తన వాళ్ళదే అని చెప్పుకునే స్థాయికి సుమన్ దిగజరుతారు అని ప్రజలు ఊహించలేదు. ఇప్పటికైనా నియోజకవర్గం లో కాంగ్రెస్ గెలుస్తుంది అని సుమన్ గ్రహించడం హర్షించదగిన విషయం అన్నారు. చెన్నూరు లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించినా ఐక్యంగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేస్తాం అని తెలిపారు. ప్రచారంలో కూడా నిజాలు చెప్పే ధైర్యం లేని సుమన్ ఎన్నికల అనంతరం ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు అని ప్రశ్నించారు. సుమన్ మాటలు లాగే సుమన్ ఉద్యమం, పోరాటం, సుమన్ చెప్పే అభివృద్ధి వుంటుంది అని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చైతన్యవంతమై రానున్న ఎన్నికల్లో సుమన్ కు తగిన బుద్ది చెప్పాలని కోరారు.