Thursday, 5 November 2026

ఎమ్మెల్యే కల్వకుంట్లను కలిసిన మైనార్టీ అధ్యక్షులు

ఎమ్మెల్యే కల్వకుంట్లను కలిసిన మైనార్టీ అధ్యక్షులు
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 10,
జనం సాక్షి:
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను శనివారం రోజున మెట్ పల్లి మర్కజి ఇంతెయాజి కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాష కలిశారు. ఇటీవల మెట్ పల్లి పట్టణంలో జరిగిన ఎన్నికల్లో మెట్ పల్లి మర్కజి ఇంతెయాజి కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాష గెలుపొందిన సందర్భంగా మర్యాదపూర్వకంగా మెట్ పల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు మహ్మద్ షాకీర్ సిద్ధికితో కలిసి ఎమ్మెల్యే నివాసంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మెట్ పల్లి మర్కజి ఇంతెయాజి కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషను ఘనంగా శాలువాతో సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తాను మరింత కృషి చేస్తానని తెలిపారు. పట్టణంలో ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి, ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తాను అన్ని విధాల సహకరిస్తానని అన్నారు. పట్టణంలో ముస్లిం మైనారిటీ వర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయిస్తానని తెలిపారు.
అనంతరం మెట్ పల్లి మర్కజి ఇంతెయాజి కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాష మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సంపూర్ణ సహకారంతో ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. షాదిఖాన నిర్మాణం, ఉర్దూ మీడియం పాఠశాల ముస్లిం స్మశాన వాటిక అన్ని మస్జిద్ ల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షకీల్ సాదక్ అబ్దుల్ జావిద్ మహమ్మద్ అజార్ మహమ్మద్ అఫ్రోజ్ ముకీమ్ నయీమ్ రహమాన్ సమి మసూద్ ఇర్ఫాన్ మైను సమీర్ ఎజాజ్ రహీముద్దీన్ అస్లం ఉస్మాన్ సాజిద్ ఇలియాస్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు