Thursday, 5 November 2026

అలంపూర్ లో డిసెంబర్ 11న ఉచిత “మెగా వైద్య శిబిరం

అలంపూర్ లో డిసెంబర్ 11న ఉచిత “మెగా వైద్య శిబిరం (అలంపూర్ జనంసాక్షి డిసెంబర్ 10)
అలంపూర్ పట్టణం నందు డిసెంబర్ ఆదివారం జయశ్రీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయను నునట్లు కార్యదర్శి మంద శ్రీనాథ్ శనివారం తెలిపారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి డాక్టర్ మంద జగన్నాథం హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజికవర్గ ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో సాయి జ్యోతి ఐ ఇనిస్టిట్యూట్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ.డా౹౹ ఎ. సాయిబాబా గౌడ్ మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులచే ఉచిత పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేయబడుతుందని తెలిపారు.
ఈ మెడికల్ క్యాంపు నందు
గుండె కి సంబంధించిన ఇసిజి, 2డిఎకో పరీక్షలు..
మహిళల కి సంబంధించిన పరీక్షలు,
కంటి కి సంబంధించిన నేత్ర పరీక్షలు, కళ్ళ జోడులు,ఆర్థోపెడిక్ ఎముకల సంబంధించిన పరీక్షలు,జనరల్ మెడిసిన్ (షుగరు, బిపి, జ్వరము, జలుబు)
రక్త పరక్షలు, దంత పరీక్షలు మొదలగునవి నిర్వహించి ఉచితంగా చికిత్సలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ ఏ డా౹౹ సాయిబాబా గౌడ్
ఫార్మాసిటికెల్ హైదరాబాద్,
మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం, సాయి జ్యోతి కంటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొనునట్లు తెలిపారు.
ఈ ఉచిత “మెగా వైద్య శిబిరం” అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.