ఎమ్మెల్యే కిశోర్ కుమార్ హ్యాట్రిక్ విజయం ఖాయం
— మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్
మోత్కూరు డిసెంబర్ 1 జనంసాక్షి : రానున్న సాధారణ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ హ్యాట్రిక్ విజయం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, మార్కెట్ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పొడిచేడు గ్రామంలో టిఆర్ఎస్ బూతు కమిటీల ఏర్పాటు సమావేశంలో వారు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ముచ్చట గా మూడోసారి గాదరి కిషోర్ కుమార్ విజయాన్ని ఎవరు ఆపలేరు అన్నారు. గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపునకు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పేలాపూడి మధు, రాంపాక నాగయ్య, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పేలాపూడి సత్యనారాయణ చౌదరి, సింగిల్ విండో వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,గ్రామ శాఖ అధ్యక్షుడు బోయపల్లి సైదులు,వార్డు సభ్యులు దెందే యాదగిరి,అంబటి మహేష్ చుక్క వెంకన్న, బండ రాంనర్సయ్య, కప్పే మల్లేష్,సింగిల్ విండో డైరెక్టర్ జిట్ట లక్ష్మయ్య, జిట్టబిక్షం, దొండ యాదగిరి,కడమంచి రమేష్, ఓర్సు నాగులు,జిట్ట సాలయ్య,జిట్ట కృష్ణ, సత్తయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కిశోర్ కుమార్ హ్యాట్రిక్ విజయం ఖాయం




