Tuesday, 3 November 2026

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
ఆధ్యా గోలి ఫౌండేషన్ చైర్మన్ గోలి మోహన్
జనం సాక్షి కదలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలో ఆరు నెలల క్రితం తల్లి చనిపోయి ఆర్థిక పరిస్థితులలో ఉన్న నిరు పేద కుటుంబానికి ,అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడు , ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ గోలి మోహన్ ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గోలి మోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆరు నెలలలోనే తల్లి వెల్చాల జమున ని కోల్పోయిన బాబుకు తాను ఆరోగ్య రక్షణగా, అదేవిధంగా చదువులకు బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు, వెల్చాల జమున తండ్రి కథలాపూర్ లో గ్రామపంచాయతీలో సిబ్బంది గ పనులు చేస్తున్న అతనికి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గం లో రానున్న కాలంలో మహిళలకు బీడీలు చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని వారికి ఫుడ్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీలు నియమిస్తున్నట్లు తెలిపారు, నియోజకవర్గం దేశంలోనే అగ్రగామిగా ఉండే విధంగా ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు ,దీనికి ప్రజలు ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని కోరారు, యువతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు, వెలిచల రమేష్ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నీరజ సత్యనారాయణ, ఎంపిటిసి గసి కంటి లతా వేణు, చింతకుంట మాజీ సర్పంచ్ పొకతోట రాజన్న, వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.