హైదరాబాద్, సెప్టెంబరు 14 : ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు తమ భూమిని కబ్జా చేసి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ జయశ్రీ అనే మహిళ మీర్‌పేట పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే భూకబ్జా సంఘటనపై పోలీసుల కేసు నగరంలో సంచలనం సృష్టించింది.




