హైదరాబాద్, సెప్టెంబరు 14 : నగర శివారు ప్రాంతంలో చైన్‌స్నాచర్‌లు రెచ్చిపోతున్నారు. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో సోమవారం ఉదయం ఇంటివద్ద పూలు కోస్తున్న మనోహరి అనే వృద్ధురాలి మెడలో ఆరుతులాల మంగళసూత్రాన్ని దుండగులు లాక్కెళ్లిపోయారు. బాధితురాలి మెడకు గాయమైంది. ఈ కాలనీలో ఐదుసార్లు ఇటువంటి ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు. భద్రత కల్పించమంటూ పోలీసులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన సందర్భంగా బాధితురాలి చేయి కూడా విరిగిందని స్థానికులు తెలిపారు.




