వరంగల్ ఈస్ట్, మే 28 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 34వ డివిజన్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అధ్యక్షతన నిన్న రాత్రి జరిగిన ఆత్మీయ సమ్మేళనం శివనగర్ పల్లవి హాస్పిటల్ సమీపంలో బ్రహ్మాండంగా జరిగింది…
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సత్యవతి రాథోడ్,శాసనమండలి డిప్యూటీ చేర్మెన్ బండా ప్రకాష్ హాజరయ్యారుశాసన మండలి డిప్యూటీ చేర్మెన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ…
నరేందర్ పోయిన సారి కంటే డబల్ మెజారిటీతో గెలవాలి మనమందరం ఆయన గెలుపుకు కృషి చేయాలి.
-ఒక అభివృద్ధి పని గురుంచి అడిగే లోపే నరేందర్ ఆ పని పూర్తి చేసి ఇంకో పని మొదలుపెడతాడు
-శివనగర్ కు ప్రత్యేక చరిత్ర ఉంది-నరేందర్ ప్రస్థానం ఈ శివనగర్ లో ప్రారంభం అయ్యింది.
-మీ ఆశీర్వాదంతో నరేందర్ ఎన్నో కుట్రలు ఛేదించి కార్పొరేటర్ గా ఇక్కడ గెలిచి మేయర్,ఎమ్మెల్యేగా గొప్పగా ఎదిగారు-అనాడు ఉన్న ఎమ్మెల్యే నరేందర్ ను కార్పొరేటర్ గా ఓడించడానికి చేసిన ప్రయత్నాలు శివనగర్ ప్రజలు తిప్పికొట్టి నరేందర్ వెంట ఉండి గెలిపించుకున్నారు.
-మేయర్ గా తన వంతుగా గొప్పగా అభివృద్ధి చేసిండు
-మేయర్ గా పని చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు చేసిర్రు అప్పటి ఎమ్మెల్యే అయిన అన్ని ఎదుర్కొని పని చేసిండు
-తెచ్చిన నిధులు నాటి ఎమ్మెల్యే చేతిలో ఉండి మేయర్ గా అభివృద్ధి కి నరేందర్ కష్టపడాల్సి వచ్చింది
-శివనగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అద్భుతంగా పూర్తి చేసిన ఘనత నరేందర్
-అద్భుతంగా 75కోట్లతో బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు
-స్టేడియం అభివృద్ధి చేసి ఇక్కడ క్రీడాకారులకు తోడ్పాటును అందించాలని కష్టపడుతున్న నరేందర్ కు అభినందనలు
-నరేందర్ కృషి పట్టుదలతో వరంగల్ జిల్లా ఏర్పాటు చేసుకొని కలెక్టరేట్ సాదించిండు నరేందర్
-వరంగల్ అభివృద్ధి లో నరేందర్ పాత్ర కీలకమైనది
-కేసీఆర్ నాయకత్వంలో వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకుంటున్నాం
-పేదలు ఎదగాలని అని దృఢ సంకల్పంతో పని చేస్తున్న నరేందర్ అండర్ రైల్వే గేటు బిడ్డగా నేను సంతోష పడుతున్న
-అన్నివర్గాల ప్రజలకు ఉపాది కల్పన చేయాలని సంకల్పంతో పని చేస్తున్నాడు
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…
మరోసారి డబల్ మెజారిటీతో నరేందర్ ఎమ్మెల్యే గెలవాలి
-పొద్దున లేస్తే చాలు మీకు అందుబాటులో ఉంటారు నరేందర్
-3800కోట్లతో అభివృద్ధి చేస్తున్న నరేందర్ ను కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి-ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడి సమస్యలతో సహజీవనం చేసి కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్, కేటీఆర్
-నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు నరేందర్
-బండా ప్రకాష్ గారు ఈ ప్రాంతం నుండి ఎనలేని కృషి చేసారు
-సర్పంచ్ నుండి ఎదిగిన నేను మంత్రిగా ఉన్నాను అంటే కేసీఆర్ గారి చలువే
-పేదల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు కేసీఆర్
-నరేందర్ మీ కౌన్సిలర్ గా మేయర్ గా ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు
– మీ కష్టసుఖాలు తెలిసిన నాయకుడు నరేందర్
-కేసీఆర్ గారు నరేందర్ గారిని ప్రోత్సయిస్తూ అభివృద్ధి దిశగా వరంగల్ తూర్పును నడిపిస్తున్నారు
-పట్టుబట్టి కలెక్టరేట్,పార్టీ కార్యాలయం,బస్ స్టేషన్ తీసుకొచ్చిన నాయకుడు నరేందర్
-కేసీఆర్ కేటీఆర్ దగ్గర మనిషి నరేందర్
-ఆత్మీయ సమ్మేళనానలు మనమందరం మన సమస్యలను వివరించుకొని పరిష్కారానికి ఆత్మీయంగా ఏర్పాటు చెస్కున్నాం.
-బిఆర్ఎస్ రాకముందు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అనేది చర్చ పెట్టాలి
-ఎన్నికలు వస్తే చాలు పగటి వేశగాళ్ళు వస్తారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళలా
-దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయితున్న స్వంత ప్రయోజనాలు చూసుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్లు అలాంటి వారు వస్తే బుద్ధి చెప్పాలి అన్నారు




