Tuesday, 3 November 2026

తొగర్ల సురేష్ కు “సరస్వతీ రాజ్ హరిదా తెలంగాణ విశిష్ట జిల్లా స్థాయి సాహిత్య” పురస్కారం

ముప్కాల్ జనం సాక్షి మే 28
మండల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న పోలీసు కవి తొగర్ల సురేష్ కు జిల్లాస్థాయి సాహితీ పురస్కారం లభించనుంది మే 31 హోటల్ లహరి ఇంటర్నేషనల్ నిజామాబాదులో నిర్వహించనున్న సరస్వతి రాజ్ హరిత ఐదవ మహాసభల్లో ప్రముఖ కవులను జిల్లా రాష్ట్ర స్థాయిలలో వారికి పురస్కారాన్ని అందజేసి ఘనంగా సన్మానించనున్నారు “సామరస్య జీవనంలో సాహితీవేత్తల కర్తవ్యం” అనే థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరై సాహితీ పురస్కారాలను అందజేయనుంది సురేష్ మాట్లాడుతూ సరస్వతి రాజ్ హరిద విశిష్ట జిల్లా స్థాయి సాహిత్య పురస్కారం అందుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉందని తన రచనలు కవితలు కథ సంపుటిలు సామాజిక కోణంలో సామాన్య వ్యక్తులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండటం అదృష్టంగా భావిస్తూ మున్ముందు సామాజిక అంశాలపై విభిన్న రచనలను కొనసాగిస్తూ ముందుకు సాగుతానని తెలియజేశారు