ఎమ్మెల్యే రెడ్యాకు శుభాకాంక్షలు తెలిపిన డోర్నకల్ బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్
-రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రెడ్యా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయండోర్నకల్, ఆగస్టు 24, జనం సాక్షి న్యూస్: ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల జాబితాను ప్రకటించడంతో డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యానాయక్ పేరు ఖరారు కావడంతో గురువారం చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన డోర్నకల్ మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కల్లెపు సతీష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, ముచ్చటకు మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ దేహమని డిఎస్ రెడ్యా డోర్నకల్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో గెలుపొంది మంత్రి పదవి చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తాయని కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు కళ్లెపు నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ గంధం సిరి ఉపేందర్, మాజీ ఎంపిటిసి బానోత్ బాలు నాయక్, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ చిలుముల రఘు, మహిళ బీసీ నాయకురాలు సురభి లలిత, దేశిని ఉపేందర్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.