శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఒరిస్సా రాష్ట్ర ఎమ్మెల్యే భూధాన్ మూర్ము

-మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగులోతు దేవిక నాయక్

డోర్నకల్/ కురవి, ఆగస్టు 24 జనం సాక్షి న్యూస్:
బిజెపి ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరామోజు నాగరాజు అధ్యక్షతన భాగంగా కురవి మండలానికి ఒరిస్సా రాష్ట్రం సరస్కొన శాసనసభ్యులు బూధాన్ ముర్ము గురువారం భద్రకాళి సమేతవీరభద్ర స్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం మండల కేంద్రము లో మండల సమావేశంలో పాల్గొన్న ప్రతి బూతు అధ్యక్షులను, కార్యకర్తలు, నాయకులను కలిసి పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం మోడీ జీ పేదలకు ఇస్తున్న పథకాలను వివరిస్తూ అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగులోతు దేవిక నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, కొణతం పెంటయ్య మండల ప్రధాన కార్యదర్శులు నర్సింగం అశోక్, కోడి రామకృష్ణ, మండల నాయకులు మాలోతు వెంకన్న మరియు బూత్ అధ్యక్షులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.