Thursday, 5 November 2026

ఎమ్మెల్యే సైదిరెడ్డి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి

ఎమ్మెల్యే సైదిరెడ్డి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి హుజూర్ నగర్ నవంబర్ 22 (జనంసాక్షి): నిత్యం ప్రజల్లో ఉంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై అసత్య ప్రచారాలు మానుకోవాలని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు గుగులోతు చందు అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా
గెలిచిన మూడు సంవత్సరాల్లోనే రూ. 3,500 కోట్ల అభివృద్ధి పనులను చేసిన ఘనత ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికే దక్కుతుందన్నారు. నిరంతరం ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతున్న నాయకుడని, హుజూర్ నగర్ ఎంపీపీ చేస్తున్న అవినీతి, అక్రమాలను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇంతకు ముందు దేవుడు అభివృద్ధి ప్రదాత అని పొగిడిన నోటితోనే మీ అవినీతి అక్రమాలను కూల్చినందుకు విమర్శిస్తున్నారన్నారు.