కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డీఈవో
కొడకండ్ల, నవంబర్22( జనంసాక్షి)
కొడకండ్ల మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కే రాజు, ఎంపీపీ ధరవత్ జ్యోతి రవీంద్ర గాంధీ నాయక్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రిజిస్టర్లు, వంట గదులు, ఆహార పదార్థాలు పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని, పాఠశాలలో వాటర్ ట్యాంక్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజిత,
హాలీమున్నిసా,ధనలక్ష్మి, రాణి,స్వప్న,మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.




