హైదరాబాద్,ఫిబ్రవరి23(జనంసాక్షి): తెలంగాణలో మరో స్థానానికి టిఆర్‌ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. వరగంల్,నల్లగొండ, ఖమ్మం జిల్లాల అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును టిఆర్‌ఎస్ ఖరారు చేసింది. రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. సుదీర్ఘ చర్చల అనంతరం వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించింది టీఆర్‌ఎస్. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి దేవీప్రసాద్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పట్టభద్రుల స్థానాలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ ఇస్పటికే పేర్లను ప్రకటించింది.




