Wednesday, 4 November 2026

వైభవంగాబ్రహ్మోత్స‌వ‌ వేడుకలు

నల్గొండ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి
):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో  భాగంగా నాల్గో రోజైన సోమవారం అలంకార సంబురాన్ని చేపట్టారు. ఉగ్రుడైన నరసింహుడిని మురళీకృష్ణుడిగా అలంకరించి తిరువీధుల్లో వూరేగించారు. అలంకార సేవోత్సవం పడమటి రాజగోపురం నుంచి తూర్పు రాజగోపురం వరకు కొనసాగింది. ఈ వేడుకలో ఆలయ ఈవో ఎన్‌.గీతారెడ్డి, వంశ పారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. తొలుత యాగశాలలో హవనపూజలు, వేదపారాయణాలు కొనసాగాయి. ఈ ఊరేగింపులో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మాడవీధుల్లో కోలాటాలు, నారసింహ శరణు ¬రెత్తింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *