Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు షాకిస్తాం – టీ.టీడీపీ అధ్యక్షుడు రమణ

హైదరాబాద్‌, (మార్చి 4): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకిస్తామని టీ.టీడిపీ అద్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకెళ్తామని ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించేందుకు ఇవాళ బీజేపీ – టీడీపీ నేతలు భేటీ అయ్యారు. బీజేపీతో కలిసి కేసీఆర్‌కు కనువిప్పు కలిగేలా తమ అభ్యర్ధులను గెలిపించుకుంటామని, నియంతృత్వ కేసీఆర్‌కు బుద్ది చెబుతామని ఆయన అన్నారు. కేసీఆర్‌ ప్రతిపక్షం గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *