Thursday, 5 November 2026

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం పై బిజెపి నాయకుల సంబరాలు

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 17. (జనం సాక్షి). హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏబీఎన్ రెడ్డి విజయం సాధించడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ చౌరస్తా వద్ద బిజెపి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాసులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆడెపు రవీందర్, ఉరవకొండ రాజు, గాజుల సదానందం , సుంకోజు రమేష్ ఎనగంటి నరేష్ చొప్పదండి శ్రీనివాస్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.