పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం
రఘునాథపాలెం మార్చి 17(జనం సాక్షి)
మండల పరిధిలోని పుటాని తండా గ్రామపంచాయతీ లో బానోతు రవీందర్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు భరత్,(5)ఇటీవల కుక్క కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ ఫౌండేషన్ ద్వారా,5 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని, వ్యక్తిగత సహాయకులు, సిహెచ్ రవికిరణ్ చేతుల మీదుగా శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు, ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బాలుడి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్, మరియు బాలుడి తండ్రి వికలాంగుడు కావున ఆయనకు సర్జరీ చేయించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అండగా ఉండి కుటుంబ సభ్యులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. గ్రామంలో ఉన్న కుక్కలను వెంటనే నియంత్రించే విధంగా కృషి చేయాలని గ్రామ సర్పంచ్ లను ఆదేశించారు. అదేవిధంగా గ్రామపంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో అంగనవాడి టీచర్ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ లక్ష్మణ్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు వీరు నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ , ఎస్.కె అఫ్జల్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ , జాటోతు సూర్య నాయక్ ,గ్రామ సర్పంచ్, భూక్య బుజ్జి, ఉప సర్పంచ్, భూక్య బాలాజీ, గ్రామ నాయకులు, బానోతు బాలాజీ, బానోతు,కొక్య, తదితరులు పాల్గొన్నారు.




