Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  తెలంగాణలో రెండు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపింఉకోవడం ద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటుతామని పిసిసి చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ దానిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రజల సమస్యలను వసి/-మరించిదన్నారు. ఈ అన్ని విషయాలను ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు.  తెరాసపై, ఆ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులపై పట్టభద్రుల్లో, నిరుద్యోగుల్లో, ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్‌పార్టీ నేతలు భావిస్తున్నారు.  హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ అగీరు రవికుమార్‌ను, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గానికి చింతకుంట నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న)కు పార్టీ తరఫునమద్దతు ఇవ్వనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన పార్టీ.. పట్టభద్రుల ఎన్నికల్లో ఏం చేయాలనే అంశంపై తీవ్రంగా తర్జనభర్జనలు పడింది. చాలామంది నిధుల కొరత కారణంగా తాము పోటీ చేయలేమని చెప్పారు. పార్టీ సమన్వయ కమిటీ ఈ అంశంపై చర్చించింది. నేతల అభిప్రాయాలను సేకరించింది. చివరికి పార్టీ తరఫున అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన పార్టీ నాయకుడు రవికుమార్‌ గుప్తా.. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. ఒక ప్రైవేటు ఛానల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తీన్మార్‌ మల్లన్నగా వ్యవహరించిన ఓయూ విద్యార్థి నేత నవీన్‌కుమార్‌ పోటీకి ఆసక్తి చూపారు. దీంతో ఈ ఇద్దరికి పార్టీ తరఫున మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదిలావుంటే టిఆర్‌ఎస్‌ కూడా పక్కాగా ప్రచారానికి సిద్దం అవుతోంది. తెరాస పార్టీ తన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్ధిగా టీఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు దేవీప్రసాద్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల ఐకాస చైర్మన్‌గా, టీఎన్జీవో అధ్యక్షులుగా, తెలంగాణ ఐకాస కన్వీనర్‌గా వ్యవహరించిన దేవీప్రసాద్‌ను శాసనమండలికి పంపుతామని ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవడంలో భాగంగానే ఆయన పేరును ఖరారు చేసినట్లు తెల్సింది.  దేవీప్రసాద్‌ పేరును ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించి ఎన్నికలకు సిద్ధంకావాలని ఆయనకు చెప్పారు. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించడం దాదాపు ఖాయమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *