Wednesday, 4 November 2026

2నేడు పిడీఎఫ్‌ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీ

ఏలూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని పీడీఎఫ్‌ అభ్యర్థి రాము సూర్యారావు ఈనెల 24వ తేదీన కాకినాడలో నామినేషన్‌ వేయనున్నారు. ఇందుకోసం  ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నట్లు యుటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ ర్యాలీ ఉదయం 7 గంటలకు ఏలూరులో ప్రారంభమవుతుందని అన్నారు. 7.30 గంటలకు భీమడోలు, 8 గంటలకు తాడేపల్లిగూడెం, 8.30 గంటలకు తణుకు, 9 గంటలకు సిద్దాంతం చేరుకుంటుందన్నారు. యుటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు సిద్ధపడి ఉండాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *