Tuesday, 3 November 2026

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మెపా వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కీసరి సాంబరాజు డిమాండ్

జనం సాక్షి, చెన్నరావు పేటజాతికే సేవ చేసే వృత్తి జర్నలిజం లో ఉండి, ఒక ప్రైవేట్ ఛానెల్ లో పని చేస్తున్న అజయ్ ముదిరాజ్ ను అక్రమంగా బందించి,ముదిరాజ్ జాతిని పరుష పదజాలంతో తిట్టడం అనేది, ముదిరాజ్ లందరిని అవమాన పరిచినట్లే అని, రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న ముదిరాజ్ లను తిడితే యావత్ జాతి చేతులు ముడుచుకొని కూర్చోదని,కౌశిక్ రెడ్డి కి తగిన బుద్ది చెపుతుందని,ఈ విషయాన్ని ఖండిస్తూ మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కోనాపురం ముదిరాజ్ గ్రామ కమిటీ సభ్యులు కోనాపురం గ్రామంలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కీసరి సాంబరాజు,అన్న బోయిన సారంగం,కీసరి రమేష్ సాంబశివుడు,బోనాల రాకేష్, అన్న బోయిన నాగరాజు, రమేష్,సూరయ్య,శీను మల్లయ్య,బాలయ్య,ఐలయ్య బాబు,సాంబయ్య,ముత్యాలు, సదయ్య తదితరులు పాల్గొన్నారు.