Wednesday, 4 November 2026

చైతన్యరాజుపై టీచర్లలో వ్యతిరేకత

ఏలూరు,మార్చి26 (జ‌నంసాక్షి)  : ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న చైతన్య రాజు పనితీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా ఆయన కౌన్సిల్లో లేవనెత్తకోపోయారని మండిపడుతున్నారు.  అధికార పక్షంతో అంటకాగి పదవుల కోసం పాకులాడారని చైతన్యరాజుపై టీచర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన కొడుకు రవికిరణ్‌ వర్మను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారే తప్ప…ప్రజలకేవిూ చేయలేకపోయారని వారు ధ్వజమెత్తుతున్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పీడీఎఫ్‌ అభ్యర్థి రాము సూర్యారావు, టీడీపీ అభ్యర్థి ఏఎస్‌ రామకృష్ణ విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్‌ మద్దతిచ్చిన పీడీఎఫ్‌ అభ్యర్థి రాము సూర్యారావు.. తన సవిూప టీడీపీ ప్రత్యర్థి చైతన్యరాజుపై విజయం సాధించారు. మరోవైపు  టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు) ఓటమి ఆ పార్టీని కలవరానికి గురిచేసింది. అయితే టీచర్లలో ఉన్న అసంతృప్తి ఈ ఎన్నిక ద్వారా వెల్లడయ్యిందని యూటిఎఫ్‌ నాయకులు అన్నారు. ఇది టీచర్లపట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *