అఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :
రానున్న కొద్ది రోజుల్లో పాత ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పదవి కాలం పూర్తి కానుంది. అయితే ఎమ్మెల్సీ మైనారిటీ రిజర్వేషన్ నుండి ఫిరాసత్ బాక్రి, ఎంకే బద్రొద్దీన్,ఖాలెకుల్ రెహ్మాన్, ఎండి సల్మాన్ లు ఈ నలుగురు ఎమ్మెల్సీ కి రేసు లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నలుగురు తోపాటు మరో కొత్త పేరు తెరమీదకు వచ్చింది. శామీర్ పేట కు చెందిన కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి ,బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్జల్ ఖాన్ కు యావత్తు రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియా పరంగా మంచి పేరుంది, ఉద్యమ సమయంలో ను ఆయన తన సత్తా చాటారు. అదేవిధంగా అఫ్జల్ ఖాన్ కు మేడ్చల్ జిల్లా ఉద్యమ కారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ ను వివరణ కొరగా సీఎం కేసిఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా బాధ్యతాయుతంగా పార్టీ బలోపేతానికి,ప్రజల సంక్షేమం కోసం జీవితం ధార పోస్తానని అన్నారు. అదే విధంగా మేడ్చల్ జిల్లానే కాక రాష్ట్రం నలువైపులా తనకు బిఆర్ఎస్ నాయకుల ,ప్రజల అండదండలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ రేసు లో అఫ్జల్ ఖాన్ తో పాటు ఐదుగురు ఉండగా ఆ పదవి ఎవరిని వరిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.
ఎమ్మెల్సీ రేసులో రాష్ట్ర కేసీఆర్ సేవాదళ్ కార్యదర్శి




