ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ.ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ.
కోటగిరి డిసెంబర్ 1 జనం సాక్షి:-ఎయిడ్స్ వ్యాధి ప్రాణాంతకమైనదని దానిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోటగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంచార్జీ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ తెలిపారు.ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని కోటగిరి జిజేసి ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,2 ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు గురువారం రోజున కోటగిరి మండల కేంద్రంలో ర్యాలీని నిర్వహించారు.ఈ ర్యాలీకి మండల తహశీల్దార్ శ్రీకాంత్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు.ఈ ర్యాలీలో కళాశాల విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిని తరిమికొట్టాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఫోగ్రాం ఆఫీసర్ రాము, కళాశాల ఉపాధ్యాయులు రవీందర్,ప్రభాకర్,గిరి,దత్తత్రి,సిబ్బంది,విద్యార్థిని,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ.ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ




