– చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్- స్కీమ్ ఆద్వర్యంలో …బూర్గంపహాడ్ జనవరి 27 (జనంసాక్షి)
బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్- స్కీమ్ ఆద్వర్యంలో ఉన్న వాలంటీర్స్ కి ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ బి. జరీన మాట్లాడుతూ హెచ్ ఐ వి ఏవిధంగా సోకుతుంది, వ్యాధి లక్షణాలు, ట్రీట్మెంట్ గ్రామంలో వాలంటీర్ల బాధ్యత గురించి వివరించారు. హెచ్ ఐ వి, ఎ ఐ డి ఎస్, సుఖవ్యాధులు, క్షయవ్యాధులపై యువత అవగాహణ కలిగి ఉండాలని, హెచ్ ఐ వి సోకిన వారిపై వివక్షత చూపకూడదని హెచ్ వి. సరళదేవి, హెచ్ హెచ్. మంజుల వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్, వాలంటీర్లు, యువత పాల్గొన్నారు




