Tuesday, 3 November 2026

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో మరోమారు బంగారం పట్టుకున్నారు. ఉదయం కస్టమ్స్‌ అదికారులు నిర్వహించిన తనిఖీల్లో 450 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబాయి నుండి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వచ్చిన ఓ వ్యక్తి వద్ద బంగారాన్ని గుర్తించిన అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి అతడి వద్ద వివరాలు లేకపోవడంతో విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *