Thursday, 5 November 2026

ఎరుకల సంఘం బలోపేత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎరుకల సంఘం బలోపేత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి- జిల్లా అధ్యక్షుడు పేరం వీరస్వామి
– ఎరుకుల వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలి
-ఘనంగా తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం 67వ ఆవిర్భావం వార్షికోత్సవం.
కురవి మార్చి19/జనం సాక్షి న్యూస్:కురవి మండల కేంద్రంలో ఆదివారం ఏకలవ్య చిత్రపటానికి పూలమాలవేసి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల  సంఘం 67వ ఆవిర్భావ వార్షికోత్సవం మండల అధ్యక్షుడు మోకరి వెంకన్న అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు పేరం వీరస్వామి పాల్గొని మాట్లాడుతూ..67 వ వార్షికోత్సవం తెలంగాణ రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా మార్చి19 ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు.తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంతడి కుమార్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.అదేవిధంగా గ్రామాలలో,పట్టణాల్లో సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు.జాతి చైతన్యం కొరకు భవిష్యత్తు తరాలకు మార్గాన్ని చూపిన ఎరుకల అమరవీరులకు మా వందనాలని తెలిపారు.మీ త్యాగాలు మరవరానిది మీరు పెట్టిన బిక్షతోనే లక్షలాదిమంది కుటుంబాలు రిజర్వేషన్ పొంది ఉన్నంత విద్యకు చదువుతూ,డాక్టర్లు,లాయర్లు, టీచర్లు,జడ్జిలుగా,పోలీస్ లుగా  ఉన్నత అధికారులు లాయర్లు ఉద్యోగాలు చేస్తున్నామంటే వారి పెట్టిన భిక్షతో అన్ని రంగాల్లో స్కాలర్షిప్ పారిశ్రామిక రంగాల్లో సబ్సిడీలు పొందుతున్నామన్నారు. ఆత్మగౌరవంతో ఈ సమాజంలో మనల్ని సమానంగా చూడాలని ఏకలవ్య బటన వేలు సాక్షిగా రాజాధికారం సాధిద్దాం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పల్లగొండ రవీందర్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి నిమశెట్టి మహేష్,మండల యూత్ అధ్యక్షులు రాగం శీను,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మచెట్టి వీరన్న,ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.