Tuesday, 3 November 2026

ఎర్రకుంట చెరువును పరిశీలించిన మంత్రి

నవీపేట గ్రామీణం: మండలంలోని అభంగపట్నం ఎర్రకుంట చెరువు రిజర్వాయర్‌ పనులను మంత్రి సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీపడకుండా పనులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముంపు భూముల రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *