Tuesday, 3 November 2026

ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణం: ధనగోపాల్‌

హైదరాబాద్‌: తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని మానవహక్కుల కమిషన్‌లో జాతీయ మానవహక్కుల కార్యకర్త ధనగోపాల్‌ పిటిషన్‌ వేశారు. సమయానికి ప్రాణవాయువు అందించకపోవటం వల్లే ఆయన మృతి చెందారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు మృతికి 108, నేషనల్‌ హైవే అధారిటీ పరోక్ష కారణమన్నారు. ఈ నెల 12లోగా నివేదిక ఇవ్వాలని శ్రీకాకుళం డీఎంఆండ్‌హెచ్‌ఓను మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *