ఎర్రబెల్లి దయాకర్ రావు ను అడ్డుకుంటాం
భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (20) జనంసాక్షి న్యూస్
గతం లో గట్ల నర్సింగాపూర్ గ్రామానికి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి పేరుమీద వచ్చి. హన్మకొండ కలెక్టర్ ముందు ప్రజల ముందు ఒక బడా పారిశ్రామిక వేత్తకు ఫోన్ చేసి గట్లనర్సింగాపూర్ గ్రామానికి మీరు 2 కోట్ల రూపాయలు వేయాలని ఆదేశించారు. ఒక వారం రోజులల్లో బడా పారిశ్రామికవేత్త కూడా వేస్తా అని మాట ఇవ్వడం జరిగింది మరి గ్రామ సర్పంచ్ ని గానీ ఎంపీడీవో ను ఎవరి అకౌంట్ లో 2 కోట్ల రూపాయలు పడ్డాయిఅని అడుగుతే మాకు ఇంకా అలాంటి డబ్బులు రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి గాలి మాటలతో టీఆర్ఎస్ ప్రభుత్వమే నడుస్తోంది. ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి?
వ్యవసాయ శాఖ మంత్రి? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. భీమదేవరపల్లి మండలం బిజెపి ఆధ్యక్షులు పైడిపల్లి పుదీరాజు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భీమదేవరపల్లి మండలం లోని కొత్తపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీని కూలగొట్టి దాదాపు ఐదు సంవత్సరాలు దాటినా ఇంతవరకు గ్రామపంచాయతీ కట్టకుండా గ్రామ పంచాయతీ శాఖ మాత్యులు గా. శంకుస్థాపన చేయాలి కానీ. నరేంద్ర మోడీ గారు రైతు వేదికల కోసం 12 లక్షల రూపాయలు ఇస్తే మీరు శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉంది. రైతు వేదికల మీద ఫోటోలు కూడా దొరల ఫోటో లు తప్పా డబ్బులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఫోటోలు లేకపోవడం విడ్డూరంగా ఉంది రాబోయే రోజులలో ఆ ఫోటోలను కూడా తొలగిస్తాం.గ్రామాలలో భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేకుండా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం 14.15.16 ఫైనాన్స్ ద్వారా డబ్బులు ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణ ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ దేవస్థానం కూడా ఒక్కరూపాయి కేటాయించకపోవడం. కనీస సౌకర్యం అయినటువంటి ముల్కనూర్ బస్టాండ్ లో మరుగుదొడ్లు గాని మేజర్ గ్రామ పంచాయతి ముల్కనూర్ లో మురికి గుంటలు తొలగించక పోవడం. ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు షాది ముబారక్ చెక్కులు పంచడం తప్ప ఈ గ్రామాలను అభివృద్ధి చేసింది శూన్యం. ఎంపీ బండి సంజయ్ కోటి 15 లక్షలు రూపాయలు అన్ని గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ చోరువ తో నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఎల్కతుర్తి నుండి మెదక్ వరకు ఫోర్ లైన్ రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది .కరోనా సమయంలో వేల కోట్ల మందికి ఉచిత టీకాలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం పాటు ఉచిత బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. పేరు పేరు ఒకరిది డబ్బులు ఒకరికి అన్న రీతిలో టిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోంది రాబోయే రోజులలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూలగొట్టి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురావేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఊసకోయిల కిషన్.గిర్రా సతీష్.నోముల బిక్షపతి.అంబీర్ కవిత. బొల్లంపెల్లి శ్యామ్. శ్రీ రామోజు శ్రీనివాస్. మోలుగు సంపత్. పోడేటి బిక్షపతి.బైరి అశోక్.మరుపాక వివేక్. కర్ణాకర్.రమేష్.గిర్రా శ్రీనివాస్.తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|