Thursday, 5 November 2026

ఎర్ర పోచమ్మకు బోనాల ఊరేగింపు..

చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో తెలుగు సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామంలోని ఎర్ర పోచమ్మకు భక్తులు ఒడిబియ్యం సమర్పించి ఘనంగా బోనాలు ఊరేగింపు చేసినారు ఎర్ర పోచమ్మ అమ్మవారి భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల ఊరేగింపును ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు