హైదరాబాద్: ముషీరాబాద్, గోల్కొండ చౌరస్తా సమీపంలోని సిటీమాల్ షోరూంకు చెందిన గోదాములో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాములో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉండటంతో మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తనష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సీఐ శ్యామ్ తెలియజేశారు.




