Tuesday, 3 November 2026

కేకే, పొన్నం, వివేక్‌లపై దాడికి యత్నం

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న సమరదీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు కేకే, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌లను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఆదివారం రాత్రి 11గంటల సమయంలో దీక్షస్థలికి వచ్చిన కేకే. పొన్నం, వివేక్‌లను కొందరు తెలంగాణవాదులు అడ్డుకొని కారు అద్దం పగలగొట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఓదశలో వారిపై దాడి చేయతోతుండగా తెరాస నేత కేటీఆర్‌ అడ్డుకొన్నారు. ముగ్గురినీ వేదికపైకి తీసుకెళ్లారు. హరీష్‌రావు కూడా ఆందోళనకారులను సమాధానపరిచారు. సంఘీభావంగా వచ్చినవారిమీద దాడి చేయడం సరికాదన్నారు.తెలంగాణకు ద్రోహం చేస్తున్న మంత్రులు జానారెడ్డి, దానం, ముఖేశ్‌ లాంటి వారి మీద పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. దీక్షకు సంఘీభావంగా వచ్చిన తమను అడ్డుకోవడం సరికాదన్నారు. లగడపాటి, ఉండపల్లి, జగ్గారెడ్డి వంటి వాళ్లను నిలదీయాలని సూచించారు. వివేక్‌ మాట్లాడుతూ… తమను శంకించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ కోసం చిత్తశుద్దితో పోరాడుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *