హైదరాబాద్ : ఎల్బీనగర్ ఎస్‌బీహెచ్ కాలనీలో నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. చిన్నారుల అదృశ్యంపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదృశ్యమైన చిన్నారుల పేర్లు.. కార్తీక్ రెడ్డి(8), తరుణ్ కుమార్ రెడ్డి(7), హర్షవర్ధన్ రెడ్డి(6), జశ్వంత్(3).




