Thursday, 5 November 2026

అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానించిన చంద్రబాబు

303qyw7aహైదరాబాద్‌: నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. తిరుమల నుంచి హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు బేగంపేటలోని కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబు క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకోగానే కేసీఆర్‌ ఆత్మీయంగా పలకరిస్తూ సాదరంగా ఆహ్వానించారు.అనంతరం కేసీఆర్‌, చంద్రబాబు లోనికి వెళ్లారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరుకావాల్సిందిగా కేసీఆర్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. కేసీఆర్‌తో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి తదితరులకు చంద్రబాబు బృందం ఆహ్వానపత్రం అందించారు. దాదాపు 8 నెలల తర్వాత తెలుగు రాష్గాల ముఖ్యమంత్రుల బ’ాటీ కావడంపై ఇరు రాష్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *