Thursday, 5 November 2026

రెడ్డి జనసంఘం చరిత్ర ఘనమైంది : సీఎం కేసీఆర్

blo9qu96హైదరాబాద్ :పాతబస్తీలోని అలియాబాద్‌లో రెడ్డి జనసంఘం వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ… 75 ఏళ్లుగా సమాజసేవ చేస్తున్న రెడ్డి జనసంఘం చరిత్ర ఘనమైందన్నారు. ట్యాంక్‌ బండ్‌పై రావుబహదూర్‌ వెంకటరామారెడ్డి, రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాప్‌రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెడ్డి హాస్టల్‌ విస్తరణ కోసం హైదరాబాద్‌ పరిసరాల్లో 10 ఎకరాల స్థలం కేటాయిస్తామని, రూ.10కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో లోకాయుక్త జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *