సైదాపూర్ జనం సాక్షి : సైదాపూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడిలో స్థానిక సర్పంచ్ చంద్ర శ్రీనివాస్ సర్పంచుల పోరాం అధ్యక్షులు మరియు సర్పంచుల ప్రధాన కార్యదర్శి కాగిత రాములు ను గౌడ సంఘం మంగళవారం రోజున ఘనంగా సన్మానించారు గత వారం రోజులుగా గౌడ సంఘం అధ్యక్షులు బొమ్మగాని రాజు ఆధ్వర్యంలో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఎల్లమ్మ దేవతను సర్పంచులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సర్పంచులకు స్థానిక గౌడ సంఘం నాయకులు సర్పంచ్లకు స్వాగతం పలికి సాంప్రదాయ బద్దంగా తిలకం దిద్ది కంకణాలు కట్టి ఘనంగా సన్మానించారు అనంతరం గౌడ సంఘం నాయకుడు మాట్లాడుతూ ఎల్లమ్మ గుడి వద్ద ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్డు నిర్మాణం చేసిన సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఎల్లమ్మ గుడి ముందు డ్రైనేజీ నిర్మించాలని విజ్ఞప్తి చేయగా వెంటనే స్థానిక సర్పంచ్ చంద్ర శ్రీనివాస్ తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అనగోని సదానందం గోపగోని నవీన్ చిన్న వెంకటరాజ్యం అనగొని పెద్దరాజు అన్నగోని శ్రీనివాస్ పైడిపల్లి నరేష్ ఆకుల రమేష్ అనగొని వెంకన్న అనగొని వెంకటరాజు అనగొని సచిన్ అనగోని శ్రీనివాస్ అనగొని రమేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు
ఎల్లమ్మ గుడిలో సర్పంచ్లకు సన్మానం చేసిన గౌడ సంఘం




