బెల్లంపల్లి, జూన్ 13, (జనంసాక్షి )
మంగళవారం రోజున బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో మంగళవారం అంతర్గత రక్షణ చర్యల విభాగంలో భాగంగా మందమర్రి ఏరియా రక్షణ అధికారి ఎమ్. రవీందర్ గనిని సందర్శించారు. ముందుగా భూగర్భగనిలోని పాత పని స్థలాలను పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ విధినిర్వహణలో భాగంగా తప్పనిసరిగా రక్షణ చర్యలు పాటిస్తూ పని చేయాలన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాదించాలని వివరించారు. ఆయన వెంట మందమర్రి ఏరియా సర్వే అధికారి ఉజ్వల్ బందోపాధ్యాయ్, ఏరియా ఇంజనీర్ కె నాగరాజు, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, జనరల్ షిఫ్ట్ ఇంఛార్జి ముస్తఫా, గని అధికారులు ఉన్నారు.
శాంతిఖని గనిని పర్యవేక్షించిన మందమర్రి ఏరియా అంతర్గత రక్షణ విభాగం సభ్యులు.




