Friday, 6 November 2026

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 11 విద్యుత్‌ ఉపకేంద్రాలు: కేసీఆర్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 11 విద్యుత్‌ ఉపకేంద్రాలు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని సదాశివనర్‌లో మిషన్‌ కాకతీయ పనులకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ… సదాశివనగర్‌ పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామన్నారు. దళితులు, గిరిజన యువతుల పెళ్లిళ్లకు రూ.51వేలు ఇస్తున్నామని తెలిపారు. తాడ్వాయిలో ఐటీఐ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి బీడీ కార్మికునికి ప్రభుత్వ సాయం అందుతుందని స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *