మంజూరు జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ నుండి మొదలుకొని మంథని వరకు ఎల్ 6 కాలువ పూడికతీత తీయడానికి రూ. 11.25 లక్షలు తన వినతి మేరకు సింగరేణి సంస్థ సి ఎస్ ఆర్ ద్వారా నిధులు మంజూరు చేసినట్లు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రైతుల పొలలకు రాజాపూర్ నుండి మొదలుకొని ఎల్ 6 కెనాల్ మంథని వరకు సింగరేణి వల్ల కాలువలో షిల్ట్ చేరి నీరు కాలువలకు చేరకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులను సింగరేణి అధికారులకు వినతి పత్రం ద్వారా షీల్డ్ తీయడానికి నిధులు మంజూరు చేయగలరని తెలుపగా సింగరేణి వారు షీల్ట్ తీయడానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, నిధులతో రాజాపూర్ నుండి మొదలు కొని కన్నాల, నాగారం, గుంజపడుగు, పోతారం, విలోచవరం, మంథని వరకు ఎల్ 6 కాలువ లోని పూడిక తొలగించనున్నారని తెలిపారు. వెంటనే సింగరేణి అధికారులు పనులు చేపట్టి పూర్తి చేయాలని
మంథని శాసన సభ్యులు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.




