Wednesday, 4 November 2026

రాష్ట్రం లో తెలంగాణ సంపాదను పెంచి మన రాష్ట్ర ప్రజలకు పంచటం ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ ఏప్రిల్ 10జనం సాక్షిభైంసా ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న నిర్మల్ జిల్లా BRS అధ్యక్షులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి..ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం లో తెలంగాణ సంపాదను పెంచి మన రాష్ట్ర ప్రజలకు పంచటం ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం .అన్నారు,మన దేశ సంపాదను .మొత్తం కార్పొరేట్ కంపనీ లకు పంచటం బీజేపీ ప్రభుత్వం పని అని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
కెసిఆర్ చేసే సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.మహారాష్ట్ర లో 1000 మందికి కనీసం 100 మందికి కూడా పిన్షన్ లేదన్నారు. అక్కడ ఇచ్చేది రూ. 600 మాత్రమే ఇక్కడ రూ. 1000 మందిలో 400 మందికి పిన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రిదే ఘనత . 2016 రూపాయిలు మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడా రూ. 600 పిన్షన్ మాత్రమేనని దుయ్యబట్టారు.గృహలక్ష్మి పథకం ద్వారా నియోజకవర్గం కు 3000 ఇండ్లు మంజూరు అయ్యాయి. అని ఇంకా 2000 కావాలి అని మన ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.మతం కాదు ముఖ్యం మనం అందరం భారతీయులం అన్ని మతాలు కులాలు కలిస్తేనే భారతమాత.
ఇప్పటి వరకు ఎంపీ నిధుల నుండి ఎన్ని దేవాలయాలు నిర్మిచ్చారో చెప్పాలి. ఒక్క రూపాయి కూడా బీజేపీ ప్రభుత్వం వారి ఎంపీ ఇవ్వలేదు . ఎప్పుడు హిందుత్వం అని చెప్పడం తప్ప దేవాలయాల అభివృద్ధి కి ఒక్క రూపాయి కూడా ఇవ్వరని ప్రశ్నించారు.సీఎం కెసిఆర్ హయం లో దేవాలయాల అభివృద్ధి ఎంతో జరిగిందని అన్నారు. ముధోల్ నియోజకవర్గం లో 80 శాతం వరకు దేవాలయల ను ముఖ్యమంత్రి, మంత్రి అటవీ న్యాయ దేవాదయ పర్యావరణ శాఖ అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేసుకున్నాం అని చెప్పారు.రైతు భీమా ద్వారా రూ. 5 లక్షలు ఇచ్చి వారి కుటుంబం కు నేను ఉన్నానని భరోసానిస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కెసిఆర్ ని కొనియాడారు.ఈ కార్యక్రమం లో BRS సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ సూర్యంరెడ్డి , మండల్ కన్వీనర్ భూమారెడ్డి, BRS సీనియర్ నాయకులు సోలాంకి భీమ్ రావు, ఎంపీపీ కల్పన గణేష్, సహకార సంఘం పరిమితి చైర్మన్ దేవందర్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,మండల కో ఆప్షన్ గజనాన్,రైతు సంఘం అధ్యక్షులు సాధశివ్, మండల సర్పంచ్ లు ఎంపీటీసీ లు BRS కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.