ఎవరూ ఛాంపియన్ కాదు: చిరంజీవి
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్దత తెచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఛాంపియన్ ఎవరూ కాదని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఈ విషయంలో ఘనత పొందేందుకు పార్టీలో ఎవరూ ఆరాటపడడం లేదని ఆయన చెప్పారు. నిధులు దారిమళ్లి ఇన్నాళ్లు నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ ప్రజలే ఉప ప్రణాళిక చట్టబద్ధత సాధించడంలో విజేతలని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇవాళ గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి నివాళులు అర్పించారు. కొందరు మిత్రులను కలుసుకునేందుకే శాసనసభ విరామ సమయంలో తాను మీడియా సమావేశాంలో పాల్గొన్నానని ఈ విషయంలోనూ వివాదం తీసుకురావడం దురదృష్టకరమని ఆయన చెప్పారు.



