హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానం డిసెంబర్ 9 లోగా ప్రత్యేక తెలంగాణ ప్రకటించకపోతే తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఫ్రంట్ ఏర్పాటు చేయగలరని మాజీ మంత్రి ఆర్, దామోదరరెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందన్నారు. రాష్ట్ర మంత్రులు జానారెడ్డి సబితాఇంద్రారెడ్డి సునీతాలక్ష్మారెడ్డి సారయ్య సుదర్శన్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ కోసం పట్టుదలతో కృషి చేస్తున్నారన్నారు. 9 లోగా తెలంగాణ ప్రకటన రాకపోతే వీరంతా రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ ఫ్రంట్ స్థాపిస్తారన్నారు. 2014 లో తన కుమారుడు సర్వోత్తమ రెడ్డి భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నారు. కాని ఏ పార్టీ టికెట్‌తో అనేది చెప్పలేదు, కోమటిరెడ్డి వైఎస్సార్సీలో చేరరని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.




