Friday, 6 November 2026

ఎస్కె సందాని మృతికి న్యూడెమోక్రసీ సంతాపం

ఎస్కె సందాని మృతికి న్యూడెమోక్రసీ సంతాపం

టేకులపల్లి, నవంబర్ 26( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంకు చెందిన ఎస్కె సంధాని గుండెపోటు తో మరణించడం పట్ల సీపీఐ (ఎం ఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్రావు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. సందాని చిన్న తనం నుండే తన అన్న ముక్తార్ పాషతో కలిసి విప్లవోద్యమం లో క్రియాశీలకంగా ఉద్యమించాడు. ఆనాటి పార్టీ అవసరాల కోసం గల పార్టీ జీప్ కు డ్రైవర్ గా దాదాపు రెండు దశబ్దాల కు పైగా సేవలాందించాడు. శత్రు దాడులనుండి, పోలీసుల నుండి పార్టీ నాయకత్వాన్ని చాక చక్యంగా తప్పించుటలో సందాని చూపిన సాహసం ఎప్పటికి మరువలేనిది. ప్రత్యేకించి ఆనాటి పార్టీ నాయకులు కామ్రేడ్ దొరన్నను, కొంతమంది ముఖ్య నాయకులను ప్రాణాపాయ స్థితి నుండి రక్షించిన తీరు ఎప్పటికి మరువలేనిది.గత దశాబ్ద కాలానికి పైగా విప్లవ రాజకీయాలకు దూరంగా బూర్గువా పార్టీలలో కొనసాగుతున్న న్యూడెమోక్రసీ లాంటి విప్లవ పార్టీలతో వివాదపడలేదు.సందాని అకాల మృతి పట్ల సంతాపం తెలుపుతూ సాదినేని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. కొత్తగూడెం డివిజన్ పి వై ఎల్ కార్యదర్శి నోముల భానుచందర్ మరొక ప్రకటనలో ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.