Friday, 6 November 2026

ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కారు : ఎమ్మెల్యే భట్టి

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను టీఆర్‌ఎస్‌ సర్కారు తుంగలో తొక్కిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 796 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నార న్నారు. పేదలపై సర్కారుకు ప్రేమ ఉంటే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలని కోరారు. బడ్జెట్‌లో మూతబడిన పరిశ్రమల ప్రస్థావనే లేదని, సచివాలయం మార్చాలనుకోవటం సర్కారు అహంకారానికి నిదర్శనమన్నారు. మెట్రోలైన్‌ మార్పుతో మూడువేల కోట్ల భారం పడిందని అంటూ తలసాని రాజీనామాపై సర్కారు ప్రకటన చేయాలని ఎమ్మెల్యే భట్టి డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *